గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నల్లగొండ కు వినతి పత్రం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, గిరిజనుల ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతున్న నేటికీ అమలు చేయలేదు. రాష్
- By khaja --
- Tuesday, 29 Mar, 2022
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మ్యానిఫెస్టోలో 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, గిరిజనుల ఓట్లు వేయించుకొని, గద్దెనెక్కి 8 సంవత్సరాలు అవుతున్న నేటికీ అమలు చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినాను అని చెప్తున్నారు, కేంద్ర వారు ఇప్పటి వరకు ఎలాంటి తీర్మానం అందలేదు అని అన్నారు. కేంద్రం మీద, రాష్ట్రం మీద ఒకరి పేరు చెప్పుకొని కాలయాపన చేస్తున్నారు. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1986 లో రిజర్వేషన్ 4% నుంచి 6% అమలు చేశారు. మరి అదే విధంగా వెంటనే గిరిజన రిజర్వేషన్ అమలు చేసి, ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు సపావత్ పాండు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్,బాలు నాయక్, యువజన కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బద్రి నాయక్, సర్పంచ్ పాండు నాయక్, కిషన్ నాయక్, జనార్దన్, MPTC ఉషా నాయక్, అనిల్ నాయక్, నాగేందర్ నాయక్, సైదా నాయక్, బాలు నాయక్, సర్దార్, నగేష్ నాయక్, చందు నాయక్, హచ్చు నాయక్, భీమా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
khaja